మద్యానికి బానిసైన భార్య.. భర్త ఏ నిర్ణయం తీసుకున్నాడంటే..

Tribal man axes wife to death in Palghar. మద్యం కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి.. అవుతున్నాయి కూడా..

By Medi Samrat  Published on  18 Sept 2021 4:29 PM IST
మద్యానికి బానిసైన భార్య.. భర్త ఏ నిర్ణయం తీసుకున్నాడంటే..

మద్యం కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి.. అవుతున్నాయి కూడా..! అలా ఓ మహిళ మద్యం లేకపోతే ఉండలేనని చెప్పుకుంది. ఎన్నో సార్లు ఆమె భర్త మద్యాన్ని మాన్పించాలని అనుకున్నాడు.. కానీ వీలు పడలేదు. ఆమె తాగి రావడం చూసీ చూసీ విసిగిపోయిన ఆ భర్త ఏకంగా ఆమెను చంపేయడంతో ఏకంగా హంతకుడయ్యాడు. తాగుడుకు బానిస‌గా మారింద‌న్న కోపంతో ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను గొడ్డ‌లితో న‌రికిచంపాడు. మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్ జిల్లా ర‌న్‌సేత్ బోయిర్ పాదా గ్రామానికి చెందిన సందీప్ గంగ్యా మోరే (46), వ‌నిత (40) ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. వ‌నిత మ‌ద్యానికి బానిస‌గా మారడంతో భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం కూడా సందీప్ గంగ్యా మోరే బ‌య‌టి నుంచి వ‌చ్చేస‌రికి వ‌నిత ఫుల్‌గా మ‌ద్యం సేవించి ఉంది. అది చూసి సందీప్ ఆగ్ర‌హానికి లోన‌య్యారు. త‌న చేతిలో ఉన్న గొడ్డ‌లితో భార్య‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో వ‌నిత అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించారు. నిందితుడిపై కేసు న‌మోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు ఉన్నారని స్థానికులు తెలిపారు. ఇటీవల కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు.


Next Story