Video : చైన్ స్నాచర్‌లను తొక్కిపట్టి నార తీసిన పోలీసులు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్‌లు జారీ చేయడంతో పాటు నేరగాళ్లపై కూడా ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించడం చూస్తుంటాం.
By Medi Samrat
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్‌లు జారీ చేయడంతో పాటు నేరగాళ్లపై కూడా ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించడం చూస్తుంటాం. తూర్పు ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో సోమవారం పట్టపగలు దుండగులు తుపాకీతో బెదిరించి ఓ యువకుడి నుంచి మూడు బంగారు గొలుసులను దోచుకుని పారిపోయారు. రోడ్డుపై అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. దుండగులు వారిపై కాల్పులు జరిపారు. రాహుల్ అనే కానిస్టేబుల్ ధైర్యసాహసాలు ప్రదర్శించి బైక్‌ను తన్ని కిందపడేలా చేశాడు. అనంతరం ఇద్దరు దుండగులు పట్టుబడ్డారు. వారిని ఘజియాబాద్ వాసి వారిస్, నంద్ నగరి నివాసి ఇమ్రాన్‌గా గుర్తించారు. వారి నుంచి రెండు పిస్టల్స్, బైక్, చైన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఏసీపీ యోగేంద్ర ఖోఖర్ నేతృత్వంలో షహదారా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వికాస్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సంజీవ్, కానిస్టేబుల్ రాహుల్, సన్నీ బృందం సోమవారం సాయంత్రం షాహదారా జీటీ రోడ్డులోని చింతామణి రెడ్‌లైట్ దగ్గర మోహరించినట్లు ట్రాఫిక్ పోలీస్ జోన్ 1 స్పెషల్ సీపీ కె జగదీషన్ తెలిపారు.
बदमाशों ने पुलिसकर्मियों पर चलाई गोलियां
— Abhishek Tiwari (@abhishe_tiwary) May 13, 2025
दिल्ली के सीमापुरी इलाके की घटना pic.twitter.com/CjIGWtLlvc
సీమాపురిలో ఓ యువకుడి నుంచి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగులు మూడు బంగారు గొలుసులను దోచుకెళ్లారని ఓ వ్యక్తి టీమ్‌కి తెలిపాడు. ఆ కిరాతకులు చింతామణి రెడ్ లైట్ వైపు వస్తున్నారని తెలిపాడు. దుండగులను చూడగానే ఆగిపోవాలని పోలీసు టీమ్ సంకేతం ఇచ్చింది. అయితే కంగారులో కిందపడిపోవడంతో దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు ధైర్యం ప్రదర్శించి దుండగుల బైక్‌ను ఢీకొట్టి అదుపు చేశారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు వారి నుంచి గొలుసులు రికవరీ చేసుకొని బాధితుడికి సహాయం చేశారు. అనంతరం నేరస్థులు వారిని సరైన స్థానానికి పంపారు.