వంతెనపై నుంచి నదిలో ప‌డ్డ ట్రాక్టర్ ట్రాలీ.. 12 మంది మృతి

Tractor Trolley falls off bridge in UP's Shahjahanpur. భగవత్ కథ కోసం కలశం నింపేందుకు భక్తులతో వెళ్తున్న‌ ట్రాక్టర్ ట్రాలీ రెయిలింగ్ విరిగి వంతెనపై నుంచి గర్రా నదిలో పడింది

By Medi Samrat  Published on  15 April 2023 5:18 PM IST
వంతెనపై నుంచి నదిలో ప‌డ్డ ట్రాక్టర్ ట్రాలీ.. 12 మంది మృతి

భగవత్ కథ కోసం కలశం నింపేందుకు భక్తులతో వెళ్తున్న‌ ట్రాక్టర్ ట్రాలీ రెయిలింగ్ విరిగి వంతెనపై నుంచి గర్రా నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎస్పీ ఎస్ ఆనంద్ సహా ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఆదివారం నుంచి తిల్హార్ ప్రాంతంలోని సునౌరా అజ్మత్‌పూర్ గ్రామంలో భగవత్ కథ నిర్వహించనున్నారు.

అంతకుముందు కలష్ యాత్రను చేయాల్సివుంది. అందుకోసం రెండు ట్రాక్టర్ ట్రాలీలలో మహిళలు, పురుషులు బిర్సింగ్‌పూర్ ప్రాంతంలోని గర్రా నదికి బయలుదేరారు. వంతెన వద్దకు చేరుకోగానే అతివేగంతో ట్రాక్టర్‌ ట్రాలీ అదుపుతప్పి రెయిలింగ్‌ విరిగి నదిలో పడింది. రెండో ట్రాలీలో ఉన్న గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న వారి సహాయంతో అందరినీ బయటకు తీశారు. క్ష‌త‌గాత్రుల‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి స‌మాచారం తెలియాల్సివుంది.


Next Story