చిన్న చిన్న తప్పులు వెతికేవాడు.. అత‌నితో ఎప్పుడూ సంతోషంగా లేను.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి సూసైడ్ నోట్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఘ‌జియాబాద్ ఇందిరాపురం కొత్వాలి ప్రాంతంలోని వసుంధర సెక్టార్ 1లో ఆదివారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు తన సోదరుడికి వాట్సాప్‌లో సూసైడ్ నోట్ పంపి ఆత్మహత్య చేసుకుంది.

By Medi Samrat  Published on  17 March 2025 9:19 AM IST
చిన్న చిన్న తప్పులు వెతికేవాడు.. అత‌నితో ఎప్పుడూ సంతోషంగా లేను.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి సూసైడ్ నోట్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఘ‌జియాబాద్ ఇందిరాపురం కొత్వాలి ప్రాంతంలోని వసుంధర సెక్టార్ 1లో ఆదివారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు తన సోదరుడికి వాట్సాప్‌లో సూసైడ్ నోట్ పంపి ఆత్మహత్య చేసుకుంది. తన భర్త, అత్తమామలు వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని ఉపాధ్యాయురాలు ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బంధువుల నుంచి పోలీసులకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాపురం కొత్వాలి పోలీసులకు ఆదివారం వసుంధర సెక్టార్ 3లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి మహిళ ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. మృతురాలు వసుంధర సెక్టార్ 1కి చెందిన డాక్టర్ గౌరవ్ శర్మ భార్య అన్విత శర్మగా గుర్తించారు.

అన్వితా దల్లుపురా ఢిల్లీలోని కేవీఎస్ స్కూల్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు 2019లో డాక్టర్ గౌరవ్ శర్మతో వివాహమైంది. వీరిద్దరికీ మూడున్నరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. డాక్టర్ గౌరవ్ శర్మ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు.

అన్విత అత్త, మామలు ఇంటికి కొంత దూరంలో ఉంటారు. గౌరవ్ ఆదివారం షాపింగ్ కోసం మార్కెట్‌కు వెళ్లాడు. కొడుకు తాతయ్య దగ్గరే ఉండిపోయాడు. ఆ తర్వాత గౌరవ్‌కు మోదీనగర్‌లో ఉంటున్న అతని బావమరిది నుంచి అన్విత సూసైడ్ నోట్ పంపిందని ఫోన్ వచ్చింది. గౌరవ్ హడావుడిగా ఇంటికి చేరుకునే సరికి తలుపు లోపల నుంచి గడియ వేసి ఉంది. గ్రిల్ కట్ చేసి ఇంట్లోకి వెళ్లింది. లోపల అన్విత ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది. గౌరవ్ ఆమెను కిందకు దించి ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించి.. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్క‌డ ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా.. వాట్సాప్‌లో సూసైడ్ నోట్ లభించింది.. అందులో భర్త, అత్తమామలు మానసిక, వరకట్న వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. భర్త త‌న‌లో చిన్న చిన్న తప్పులు వెతికేవాడని.. అత‌డితో ఎప్పుడూ సంతోషంగా ఉండలేదని పేర్కొంది. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూనే.. ఇక తట్టుకోలేనని రాసింది. కొడుకును చాలా ప్రేమిస్తున్నాన‌ని.. అతనిని బాగా చూసుకోవాలని సోదరుడికి సూచించింది.

Next Story