Kurnool : అనుమానాస్పద స్థితిలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు మృతి

కర్నూలు పట్టణంలో ఆదివారం ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

By Medi Samrat  Published on  19 May 2024 3:45 PM IST
Kurnool : అనుమానాస్పద స్థితిలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు మృతి

కర్నూలు పట్టణంలో ఆదివారం ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పట్టణ సమీపంలోని గార్గేయపురం చెరువులో రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం చెరువు కట్టపై మరో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల గుర్తింపు, మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Next Story