చైన్నైలో కాల్పుల కలకలం.. ముగ్గురి దారుణహత్య
Three of family shot dead in Chennai. చైన్నైలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వ్యక్తి గన్‌తో రెచ్చిపోయాడు.
By Medi Samrat
చైన్నైలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వ్యక్తి గన్‌తో రెచ్చిపోయాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కాల్చిచంపాడు. వివరాళ్లోకెళితే.. బుధవారం రాత్రి చెన్నైలోని సావుకార్పెట్టైలో నివాసముంటున్న దళిలీచంద్ కుటుంబంపై దుండగుడు కాల్పులకు దిగాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.
ఈ ఘటనలో దళిలీచంద్, ఆయన భార్య పుష్సబాయి, కొడుకు శీతల్‌లు చనిపోయారు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ తగాధాలే కారణమని తెలుస్తోంది. దళిలీచంద్ కుమారుడు శీతల్‌కు తన భార్యకు మధ్య గత కొంత కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆమె భర్తకు దూరంగా ఉంటోంది.
శీతల్ భార్యకు సంబంధించిన బంధువులే కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. సీసీ పుటేజీ ఆధారంగా కాల్పులకు పాల్పడ్డవారు ఎవరని గుర్తించేపనిలో ఉన్నారు. శీతల్ భార్య బంధువులే నేరుగా వారే వచ్చి కాల్పులు జరిపారా..? లేక ఎవరికైన సుఫారీ ఇచ్చి హత్య చేయించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదిలావుంటే.. ఘటనాస్థలాన్ని చెన్నై పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్, చెన్నై నార్త్ అదనపు కమిషనర్ అరుణ్ కుమార్, అసోసియేట్ కమిషనర్ బాలకృష్ణన్, ఫ్లోరిస్ట్ డిప్యూటీ కమిషనర్ మహేశ్వరన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మహేష్‌కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైంది. ఈ సంఘటనకు సంబంధించి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.