పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 3 నెలల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం

Three of a family including infant girl killed in accident in Peddapalli. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు నెలల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

By అంజి  Published on  21 Dec 2021 10:33 AM IST
పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 3 నెలల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్‌ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు నెలల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బాధితులు ప్రయాణిస్తున్న ఆటోరిక్షాపై లారీ పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. రాజీవ్ రహదారిపై గంగానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద లారీ మరో లారీని ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూడిదతో కూడిన లారీ ఫ్లై-ఓవర్ బ్రిడ్జి నుండి క్రిందికి వెళుతుండగా, సమీపంలోని పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపిన తర్వాత బొగ్గుతో కూడిన లారీ సంఘటనా స్థలంలో యు టర్న్ తీసుకుంది. దీంతో రెండు లారీలు ఢీకొనడంతో ఒక లారీ అటుగా వెళ్తున్న ఆటోరిక్షాపై పడింది.

ఈ ఘోర ప్రమాదంలో ఎస్‌కె షకీల్ (30), అతని భార్య రేష్మా బేగం (28), కుమార్తె సదియా ఉమ్రా (3 నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రామగుండం ముబారక్‌నగర్‌ వాసులు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంచిర్యాల జిల్లా ఇందారం వెళుతున్నారు. ఘటన జరిగిన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆటోరిక్షాలో ప్రయాణిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story