24 గ్రామాల్లో దాడులు నిర్వహించి.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు
Three more accused arrested, police are raided 24 villages. హర్యానాలోని గురుగ్రామ్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
By Medi Samrat Published on 24 July 2022 3:15 PM GMTహర్యానాలోని గురుగ్రామ్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సురేంద్ర సింగ్ హత్యకు సంబంధించి శనివారం మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుడు ఇక్కార్ మానసిక స్థితి సరిగా లేదని అతని తరపు న్యాయవాది చెప్పాడు. నిందితుడు మానసిక వికలాంగుడని, ఈ కేసుతో అతడి ఎలాంటి సంబంధం లేదని ఇక్కార్ తరపు న్యాయవాది నూహ్ పోలీసులకు వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారు. ఇక్కార్ తరపు న్యాయవాది ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ.. ''ఎవరైనా ఇక్కార్‌ని చూస్తే అతనికి మతిస్థిమితం లేదని వెంటనే అర్థమవుతుంది. అతని వైకల్య ధృవీకరణ పత్రాన్ని నూహ్ పోలీసులకు అందజేశాము. పోలీసుల స్పందన కోసం ఎదురు చూస్తున్నామని, సమాధానం రాకపోతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తాం." అని అన్నారు.
ఘటన జరిగిన రోజునే ఇక్కార్‌ను అరెస్టు చేశారు. డీఎస్పీని చితకబాదిన లారీలోనే ఇక్కార్ సహ డ్రైవర్ గా ఉన్నాడని అంటున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని పచ్‌గావ్‌లో నివాసముంటున్న భురు అలియాస్ తౌఫీక్, అస్రు అలియాస్ అస్రుద్దీన్, రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా గండ్వా గ్రామానికి చెందిన లంబు అలియాస్ యూసుఫ్‌లను శనివారం అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు నిందితులను హర్యానాలోని నుహ్‌లోని కోర్టు ముందు హాజరుపరిచారు. వారికి రెండు రోజుల పోలీసు కస్టడీలో భాగంగా రిమాండ్ విధించారు. కేసులోని ఇతర నిందితులను పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కింద 24 గ్రామాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తిరుగుతున్న 236 వాహనాలను సీజ్ చేశారు.