తిరుపతికి వెళ్తుండ‌గా ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నంద్యాల జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By -  Medi Samrat
Published on : 27 Feb 2026 4:03 PM IST

తిరుపతికి వెళ్తుండ‌గా ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నంద్యాల జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. బెంగళూరుకు చెందిన ప్రమోద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి బయలు దేరగా.. నంద్యాల జిల్లా డోన్‌ జాతీయ రహదారి జగదుర్తి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రమోద్‌ భార్య, కుమారుడు, కుమార్తె మృతి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ప్రమోద్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్రేన్ ను కారు ఢీకొట్టి ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందడం అత్యంత దురదృష్టకరం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం విచారకరం అన్నారు. రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి జిల్లా అధికారులను ఆరా తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడికి మెరుగైన వైద్యసాయం అందించాలని మంత్రి ఆదేశించారు. తరుచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న క్రమంలో, ప్రయాణాల వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.

Next Story