డబ్బు దోచుకునే విషయంలో దొంగలు ఎంతకైనా తెగిస్తారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. ఏటీఎం మిషన్‌ను దొంగలు ఎక్స్‌కవేటర్‌తో(జేసీబీ) తవ్వి బయటికి తీశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఏటీఎం బూత్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు దొంగల దొంగతనం సూపర్ అని అంటున్నారు. మరికొందరు నిరుద్యోగం కారణంగా ఇలాంటి వాటికి పాల్పడుతున్నట్లు నిందించారు.క్రిప్టో మైనింగ్ యుగంలో.. ఒక కొత్త ఆవిష్కరణ.. 'atm మైనింగ్' అని కామెంట్లు చేశారు. జేసీబీ సాయంతో దోపిడీకి పాల్పడ్డ సమయంలో ఏటీఎం మెషీన్ తుక్కుతుక్కు అయిపోయింది.
కొద్దిరోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో హార్డ్‌వేర్ దుకాణంలో దోపిడి చేసిన దొంగ డ్యాన్స్ చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీస్ సూపరింటెండెంట్ నివాసం సమీపంలోనే ఈ ఘటన జరిగింది.దొంగ మొత్తం నగదును ఎత్తుకెళ్లాడని, వేల రూపాయల విలువైన వస్తువులను కూడా దొంగిలించాడని దుకాణ యజమాని అన్షు సింగ్ చెప్పారు. పగిలిన షట్టర్‌ని చూసి సింగ్ తన దుకాణంలో దొంగతనం జరిగిందని గుర్తించాడు. ఇక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా దొంగ డ్యాన్స్ చేయడం కూడా కనుగొనబడింది.