కారు బీభత్సం : పోలీసుల మీదకు ఓవర్ స్పీడ్ లో వెళ్లి..

The speeding car hit the policemen. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వారాలో వేగంగా వచ్చిన కారు బీభత్సం సృష్టించింది.

By Medi Samrat  Published on  9 Feb 2022 10:04 AM GMT
కారు బీభత్సం : పోలీసుల మీదకు ఓవర్ స్పీడ్ లో వెళ్లి..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వారాలో వేగంగా వచ్చిన కారు బీభత్సం సృష్టించింది. వెహికల్ చెక్‌పాయింట్‌ మీదకు అతివేగంగా కారు దూసుకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. ఈ విజువల్స్ ను బట్టి ఆ వాహనం ఎంత వేగంగా వచ్చిందో మనం ఊహించుకోవచ్చు. పరాసియా రోడ్‌ లో వివాహ కార్యక్రమం నుండి తిరిగి వస్తున్న కారు నియంత్రణ తప్పి చెక్ పాయింట్ వద్ద ఉన్న పోలీసులపైకి దూసుకెళ్లింది. ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఒక ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఉత్తరప్రదేశ్ నంబర్‌కు చెందిన కారులో నలుగురు వ్యక్తులు వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. పరాసియా వద్ద సర్క్యూట్ హౌస్ సమీపంలోని కారును ఆపే ప్రయత్నం చేయగా, వాహనం అదుపు తప్పడంతో కారు కానిస్టేబుల్ హస్ముఖ్ సూర్యవంశీ, ఏఎస్‌ఐ కిషోర్ కుమార్ మీదుగా వెళ్ళింది. ఓ దుకాణం మీదకు కూడా వాహనం వెళ్ళిపోయింది. ASI కిషోర్ కుమార్, కానిస్టేబుల్ హస్ముఖ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడ్డారు. వారు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అదే సమయంలో, పోలీసులు డ్రైవర్‌పై ఐపిసి సెక్షన్లు 279, 337, 186, 353 మరియు ఎంపి ఆస్తి నష్టం చట్టంలోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు.


Next Story