కొడుకును బావిలో విసిరేసిన తల్లి.. ఆమె నిజం చెప్పినా నమ్మలేదట..
The quarrel of the parents took the life of the child! dead body found in well. మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 8 Dec 2021 7:09 PM ISTమహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన రెండేళ్ల కుమారుడిని బావిలో పడేసింది. అనంతరం జరిగిన విషయాన్ని తల్లి కుటుంబ సభ్యులకు చెప్పింది. మొదట్లో ఆమె మాటలు పట్టించుకోని జనం సాయంత్రం అయినా చిన్నారి కనిపించకపోవడంతో టెన్షన్ పడ్డారు. ఆమె చెప్పిన బావిలో వెతకగా మృతదేహం కనిపించింది. లాతూర్ జిల్లాలోని నిలంగా పోలీస్ స్టేషన్ పరిధి లోని రాథేడా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మాయ వెంకట్ పంచాల్, ఆమె భర్త వెంకట్ పంచాల్ కు 2 ఏళ్ల కుమారుడు సమర్థ్ పంచాల్ ఉన్నాడు. వాళ్లు రాథెడ గ్రామంలో నివసిస్తున్నారు. నెల రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అప్పటి నుంచి భర్త వెంకట్ పంచాల్ 20 కిలోమీటర్ల దూరంలోని అవుసా గ్రామంలో నివాసం ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పటి నుంచి వెంకట్ తన కొడుకును కలవడానికి వారానికి ఒకరోజు గ్రామానికి రావడం ప్రారంభించాడు, కాని అతని భార్యను మాత్రం మాట్లాడడం లేదు.
దీంతో ఆమెకు కోపం వచ్చి, తన రెండేళ్ల కుమారుడిని బావిలో పడేసింది. మాయ తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పింది. అయితే అలా చేసి ఉండదని ఆమె మాటలు పట్టించుకోకుండా పనిలో పడ్డారు. సాయంత్రం అయినా పిల్లాడు కనిపించలేదు. దీంతో మాయ చెప్పిన మాటలు కుటుంబ సభ్యులకు గుర్తుకు వచ్చింది. వెంటనే వెంకట్‌కు సమాచారం అందించాడు. వెంకట్ గ్రామానికి తిరిగి వచ్చి కొడుకు సమర్థ కోసం వెతకడం ప్రారంభించాడు. అప్పటికే బావిలో మునిగిపోయాడు.. రాత్రి చీకటిలో కనిపించలేదు, సోమవారం ఉదయం బావిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించబడింది. బావిలోనే కుమారుడి మృతదేహం లభ్యమైంది. ఫిర్యాదు మేరకు హత్య కేసులో చిన్నారి తల్లి మాయా పంచల్‌పై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. మాయా పంచాల్ మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు మొత్తం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగానే చిన్నారి హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టు చేసిన తల్లి కూడా తన నేరాన్ని అంగీకరించింది.