దారుణం.. కాపురానికి రాలేదని.. కత్తితో గొంతు కోసిన భర్త.!

The husband who attacked the wife with a knife. చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాపురానికి రాలేదని భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త.

By అంజి
Published on : 25 Oct 2021 9:05 AM IST

దారుణం.. కాపురానికి రాలేదని.. కత్తితో గొంతు కోసిన భర్త.!

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాపురానికి రాలేదని భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమల మండలం 81 ఉప్పరపల్లె పంచాయతీ మల్లోలపల్లెకు చెందిన భాగ్యశ్రీకి, పూతలపట్టు మండలం దొమ్మాల్లపెల్లకు చెందిన వెంకటాద్రితో 3 ఏళ్ల కిందట వివాహామైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. భార్య భాగ్య శ్రీ ఆరోగ్యం బాగోలేదని 3 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆదివారం రోజు భర్త వెంకట్రాది అక్కడికి వచ్చి.. భార్యను తనతో ఇంటికి రావాలని కోరాడు.

కొన్ని రోజుల తర్వాత వస్తానని భర్తకు చెప్పింది. కోపంతో ఆస్పత్రిలో చూపించుకొని వస్తానని నమ్మించి భార్యను బైక్‌ ఎక్కించుకొని భర్త సోమలకు బయల్దేరాడు. ఇంటికి వెళ్తుండగా అడుసుపల్లె గ్రామ శివారు వద్ద బైక్‌ ఆపిన వెంకటాద్రి తన దగ్గర ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమె గట్టిగా అరవడంతో కత్తితో గొంతు కోసి అక్కడి నుండి పరారయ్యాడు. కేకలు విన్న రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి పీలేరు ఆస్పత్రికి.. అనంతరం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం.

Next Story