కుమార్తెపై తండ్రి హత్యాచారం, హత్య.. విషయం తెలిసిన భర్త షాకింగ్ నిర్ణయం
The husband, saddened by the rape of his wife, committed suicide. భార్యపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసి సెహోర్‌లో ఆమె భర్త ఉరివేసుకుని
By Medi Samrat Published on 20 Nov 2021 11:36 AM GMTభోపాల్: భార్యపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసి సెహోర్‌లో ఆమె భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని సేకరించి శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసులో సమర్పించిన ఆధారాల ప్రకారం.. మృతుడు 21 ఏళ్ల వ్యక్తి అని తెలిసింది. రాయ్‌పూర్‌లోని ఒక టెంట్‌లో పనిచేస్తాడని.. మొహల్లా పాంగ్రికి చెందిన ఒక మహిళను ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవల అతడి భార్యను సొంత తండ్రే అత్యాచారం చేసి.. అడవిలో చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో భర్త తాను బ్రతకలేనని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
తండ్రే కుమార్తెను రేప్ చేసి చంపి.. అడవుల్లో పడేశాడు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సంస్‌గఢ్ అడవుల్లో ఓ మహిళ, ఆమె కుమారుడి మృతదేహం లభ్యమైన కేసులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు ముందు మహిళపై అత్యాచారం జరిగిందని.. హత్య చేసిన వ్యక్తి మరెవరో కాదు.. చనిపోయిన మహిళ కన్నతండ్రి అని తెలిపారు. 2 రోజుల క్రితం సంస్‌గఢ్ అడవుల్లో ఛిద్రమైన మహిళ, చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశామని రాతిబాద్ పోలీసులు సుదేష్ తివారీ మీడియాకు తెలిపారు.
పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు.. మృతదేహం సెహోర్ జిల్లాలోని బిల్కిస్‌గంజ్‌లో నివసిస్తున్న మహిళ, ఆమె కుమారుడిదని తేలిందని ఆయన చెప్పారు. దీని ఆధారంగా పోలీసులు విచారించగా ఎన్నో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మృతురాలికి ఏడాది క్రితం ప్రేమ వివాహంజరిగింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీని ఆధారంగా కుటుంబ సభ్యులను విచారించగా తండ్రిపై అనుమానం వచ్చింది. పోలీసుల విచారణలో ఆమె తండ్రి నేరాన్ని అంగీకరించాడు.. అతను చెప్పినది విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. కన్నతండ్రి తన కూతురిపై ఇలాంటి దారుణానికి ఒడిగడతాడా అని అందరూ నిర్ఘాంతపోయారు.
సుదేష్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడి కుమార్తెకు ప్రేమ వివాహం జరిగిందని, ఆ తర్వాత ఆమె రాయ్‌పూర్‌కు వెళ్ళిపోయింది. కూతురు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడంతో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని.. అందుకే తాను కోపాన్ని పెంచుకున్నానని పోలీసులతో నిందితుడు తెలిపాడు. పెళ్లయినప్పటి నుంచి అతడి కూతురు ఇంటికి రాలేదు.
దీపావళి రోజున రాయ్‌పూర్‌లో భర్తతో కలిసి నివసిస్తున్న మహిళ రతీబాద్‌లోని తన అక్క ఇంటికి చేరుకుంది. ఆమె ఎనిమిది నెలల కుమారుడు అనారోగ్యంతో చనిపోవడంతో, ఆమె అక్క తన తండ్రిని సంప్రదించి సహాయం కోరింది. సమాచారం అందుకున్న తండ్రి తన కుమారుడితో కలిసి రతీబాద్ చేరుకుని చనిపోయిన శిశువుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తమతో పాటు అటవీ ప్రాంతానికి రావాల్సిందిగా మహిళను కోరాడు. మహిళ సోదరుడు రోడ్డుపై నిలబడి ఉండగా.. ఆమె తన తండ్రితో కలిసి అడవికి వెళ్లింది. తండ్రి మహిళపై దాడి చేసి, ఆమెపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతరం కొడుకుతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. చిన్న కూతురిని తానే హత్య చేసినట్లు ఆమె పెద్ద కుమార్తెకు కూడా తెలియజేశాడు. నేరం అంగీకరించిన తర్వాత నిందితుడైన తండ్రిపై ఐపీసీ సెక్షన్ 302, 376 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.