భర్త మ‌ర‌ణాన్ని తట్టుకోలేని భార్య.. మృతదేహం ద‌గ్గ‌ర‌ క‌న్నీళ్లు కారుస్తూనే..

The husband died, the wife also took her last breath near the dead body. వివాహ బంధం ఎంతో గొప్పదని ఊరికే చెప్పరు.. చివరి వరకూ తోడూ నీడగా ఉండాలని

By Medi Samrat  Published on  8 Feb 2022 4:07 PM IST
భర్త మ‌ర‌ణాన్ని తట్టుకోలేని భార్య.. మృతదేహం ద‌గ్గ‌ర‌ క‌న్నీళ్లు కారుస్తూనే..

వివాహ బంధం ఎంతో గొప్పదని ఊరికే చెప్పరు.. చివరి వరకూ తోడూ నీడగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కొన్ని దశాబ్దాల పాటూ కలిసి బతికారు. భర్త చనిపోయాడనే చేదు నిజాన్ని భరించలేని భార్య.. చివరికి కొన్ని గంటల్లో ఆమె కూడా తుది శ్వాస విడిచింది. భర్త చనిపోవడంతో షాక్ తట్టుకోలేని భార్య కూడా కొంతసేపటికి చనిపోయిన ఘటన ఎంపీ ఛింద్వారాలో వెలుగులోకి వచ్చింది. చింద్వారాలోని చాంద్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున వృద్ధ దంపతులు ప్రాణాలు విడిచారు అనే వార్త అందరినీ షాక్ కు గురిచేసింది. వారి చావుకు సంబంధించిన విషయం తెలిసి వారి కళ్లు చెమర్చాయి.

95 ఏళ్ల గణేష్ లాల్ మరణించడంతో ఆ ప్రాంతంలో శోకసంద్రం నెలకొంది. గణేష్ లాల్ అంతిమ యాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఆయన మృతి చెందడంతో సోమవారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. గణేష్ లాల్ దహన సంస్కారాల సన్నాహాల మధ్య, 85 ఏళ్ల భార్య గీత ఆయన మృతదేహం దగ్గర చాలా సేపు కూర్చుంది. ఆమె ఏడుస్తూనే ఉంది. గీత తన భర్త మరణాన్ని తట్టుకోలేక అర్థరాత్రి భర్త మృతదేహం దగ్గర అపస్మారక స్థితికి చేరుకుంది. కొన్ని నిమిషాలకు ఆమె కూడా మరణించింది. ఇంటి పెద్దలు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం ఉదయం భార్యాభర్తలిద్దరికీ కలిపి అంతిమ యాత్ర నిర్వహించారు. అశ్రునయనాల మధ్య ఇద్దరికీ అంత్యక్రియలు జరిగాయి.


Next Story