ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఓ మహిళను మానసికంగానూ, శారీరకంగా హింసించి.. ఆమె జీవితాన్ని నరకప్రాయం చేశారు. అలీఘర్‌లోని మహువా ఖేడా పోలీస్ స్టేషన్‌లో ఓ యువకుడు మత్తు మందు ఇచ్చి మహిళపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తన మొబైల్ కెమెరాలో అశ్లీల వీడియోలు, ఫోటోలను కూడా బంధించాడు. వాటిని వైరల్ చేస్తానని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై చాలాసార్లు అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది.
ఆ మహిళ అతడి టార్చర్ ను భరించలేనని చెప్పడంతో.. నిందితుడు అశ్లీల వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్‌లో పెట్టాడు. వీడియో-ఫోటోలను మహిళ భర్తకు పంపాడు. ఈ సంఘటనపై ఫిర్యాదు చేయడానికి బాధిత మహిళ, ఆమె భర్త కాంగ్రెస్ నాయకుడితో కలిసి SSP కార్యాలయానికి చేరుకున్నారు.
విషయం గురించి తెలియగానే భర్త, భార్యను తీసుకెళ్లి నిందితుడిపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో పోలీసులు కాలయాపన చేస్తూనే సెటిల్‌మెంట్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, దీంతో ఉన్నతాధికారులు న్యాయం చేస్తారని వచ్చామని బాధిత దంపతులు తెలిపారు. ఘటన గురించి తెలుసుకున్న ఎస్‌ఎస్పీ కళానిధి నైతానీ పోలీసులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత మహిళ బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై సెక్షన్ 376, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సీఓ మోహిసిన్ ఖాన్ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుడిని పోలీసులు జైలుకు పంపారు.