అత్తను జుట్టుపట్టుకుని చితక్కొట్టిన కోడలు.. వీడియో వైరల్ అవ్వడంతో..!

The daughter-in-law brutally thrashed the mother-in-law by grabbing the hair. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వృద్ధురాలిపై ఆమె కోడలు అతి దారుణంగా దాడి చేసింది.

By Medi Samrat  Published on  14 May 2022 9:08 AM GMT
అత్తను జుట్టుపట్టుకుని చితక్కొట్టిన కోడలు.. వీడియో వైరల్ అవ్వడంతో..!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వృద్ధురాలిపై ఆమె కోడలు అతి దారుణంగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడి ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోడలిపై పలు సెక్షన్స్ కింద చర్యలు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. వృద్ధురాలి వయసుకు కూడా విలువ ఇవ్వకుండా కోడలు.. అత్తపై దాడి చేసింది. వీడియోను చూస్తే ఇంత దారుణంగా హింసిస్తారా అని అనిపించకమానదు.

వృద్ధురాలిపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విషయం తెలుసుకున్నారు. పోలీసులు బాధితురాలి ఇంటికి చేరుకుని విచారించారు. వృద్ధురాలు జైరామ్ దేవి తన భర్త భగవాన్ బాలితో కలిసి చకేరీలోని భౌపూర్‌లో నివసిస్తున్నట్లు తేలింది. అతని కోడలు ఆర్తి గుప్తా కొన్ని నెలలుగా అత్తని కొడుతుంది. స్థానికులు ఈ దాడికి సంబంధించిన వీడియోను తీసి వైరల్ చేశారు. వైరల్ వీడియో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దాకా వెళ్లడంతో.. ఆయన ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించారు. పోలీసులు ఆర్తిని అరెస్టు చేశారు. వృద్ధురాలిపై దారుణంగా దాడి చేసిన కేసులో కోడలు ఆర్తిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.


Next Story
Share it