Telangana : బాలుడిపై అత్యాచారం చేసిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష

2019లో 6 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన కేసులో 24 ఏళ్ల వ్యక్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

By Medi Samrat  Published on  28 Feb 2025 7:16 PM IST
Telangana : బాలుడిపై అత్యాచారం చేసిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష

2019లో 6 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన కేసులో 24 ఏళ్ల వ్యక్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడిని మహ్మద్‌ ఇద్రీస్ గా గుర్తించారు. అలాగే 30,000 జరిమానా, ఆ మొత్తాన్ని చెల్లించని పక్షంలో అదనంగా మరో రెండు నెలల జైలు శిక్షను కూడా కోర్టు విధించింది. బాధితుడికి శారీరక, మానసిక గాయాలకు గానూ రూ.3 లక్షల పరిహారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ)ని కోర్టు ఆదేశించింది.

నివేదికల ప్రకారం, 2019 అక్టోబర్‌లో బాలుడు తన సోదరితో కలిసి వారి ఇంటి దగ్గర ఆడుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. నిందితుడు తన కొడుకును గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని బాధితుడి తల్లి ఫిర్యాదు చేసింది. విచారణ సమయంలో సమర్పించిన వైద్య నివేదికలు, ఇతర ఆధారాల కారణంగా బాలుడిపై నిందితుడు అత్యాచారం చేశాడని తేలింది. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 377, లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే (POCSO) చట్టం ప్రకారం అతడిని దోషిగా నిర్ధారించారు.

Next Story