Suryapet : కూతురిని వేధిస్తున్నాడ‌ని భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌లు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా గ్రామంలో కుమార్తెను వేధిస్తున్నాడ‌ని ఓ వ్యక్తిని సోమవారం ఇద్దరు భార్యలు రోకలితో కొట్టి చంపారు.

By Medi Samrat  Published on  13 Jan 2025 6:21 PM IST
Suryapet : కూతురిని వేధిస్తున్నాడ‌ని భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌లు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా గ్రామంలో కుమార్తెను వేధిస్తున్నాడ‌ని ఓ వ్యక్తిని సోమవారం ఇద్దరు భార్యలు రోకలితో కొట్టి చంపారు. ఇద్దరు భార్యలు రమ్య, సుమలత దాడిలో మృతుడు ఆర్ సైదులు అక్క‌డిక్క‌డే ప్రాణాలు వ‌దిలాడు. సైదులు 2004లో రమ్యను వివాహం చేసుకున్నాడు. రమ్య గర్భవతిగా ఉన్న సమయంలోనే ఆమె సోదరి సుమలతను ప్రలోభపెట్టి దాడి చేశాడు. తరువాత 2013లో ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లుగా సైదులు తాగి ఇంటికి వచ్చి ఇద్దరినీ నిత్యం వేధించేవాడు.

హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న రమ్య కుమార్తె జనవరి 10న సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి విషమించింది. తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో మృతుడు కూతురిని వేధింపులకు గురిచేశాడు. ఈ సంఘటనతో కలత చెందిన రమ్య, సుమలతతో భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌పై చ‌ర్చించింది. సైదులు ఎప్పటికీ మారడని భావిచిన భార్య‌లిద్ద‌రు అతడిని హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్ర‌మంలోనే సైదులు నిద్రిస్తున్న సమయంలో వారు రోకలితో దాడి చేశారు. మృతుడి తల, వృషణాలపై బ‌లంగా మోదారు. దీంతో అత‌డు మ‌ర‌ణించాడు. మృతుడిని శవపరీక్ష నిమిత్తం సూర్యాపేట వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సివుంది.

Next Story