సోమవారం నాడు గ్వాలియర్ రైల్వే స్టేషన్‌లో కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యురాలు.. ఓ వ్యక్తిని మాస్క్ ధరించమని కోరగా.. సదరు వ్యక్తి తహసీల్దార్ అని తేలింది. అతడు నిబంధనలు పాటించకుండా మహిళా వైద్యురాలితో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా.. బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తహసీల్దార్‌పై ఫిర్యాదు చేసేందుకు రైల్వేస్టేషన్‌లోని వైద్యులంతా కలిసి నిరసన వ్యక్తం చేసి జీఆర్పీ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఫిర్యాదు దరఖాస్తు, సీసీటీవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. "మాస్కులు ధరించని వ్యక్తులను ఆపాలని కలెక్టర్ల నుండి నాకు ఆదేశాలు ఉన్నాయి. నేను తహసీల్దార్‌ను ఆపివేసాను. అయితే అతను నన్ను నెట్టివేసి నన్ను ఆపడానికి మీరు ఎవరు అని అడిగారు. నేను తహసీల్దార్‌ని అని బెదిరించారు" అని అన్నారు మహిళా డాక్టర్. "సోమవారం, ఒక తహసీల్దార్ మహిళా వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. వారు ఫిర్యాదు చేయడంతో మేము కేసు నమోదు చేసాము," GRP పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి బలరామ్ తెలిపారు.