పొరపాటున రాంగ్ ట్రైన్ ఎక్కిన బాలిక‌.. రైలు దూకి వెళ్తుండ‌గా దారుణం

పొరపాటున రైలులో కూర్చున్న బాలికకు ఊహించ‌ని చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది.

By Medi Samrat
Published on : 28 March 2025 7:44 AM IST

పొరపాటున రాంగ్ ట్రైన్ ఎక్కిన బాలిక‌.. రైలు దూకి వెళ్తుండ‌గా దారుణం

పొరపాటున రైలులో కూర్చున్న బాలికకు ఊహించ‌ని చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. బాలిక‌ బరేలీ సిటీ, బరేలీ జంక్షన్ మధ్య ఔటర్‌లో బోగీ నుండి దూకి ట్రాక్ ప‌క్క‌న న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా.. ఇంతలో నిందితుడు బాలిక‌ను పొదల్లోకి లాగాడు. అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు పారిపోయాడు.. ఆపై గాయపడిన బాలిక రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ ఆర్‌పిఎఫ్ పోలీసుల వ‌ద్ద‌కు చేరుకుంది. అర్థరాత్రి బాలిక‌కు ఆరోగ్య పరీక్ష జరిగింది. బాధిత బాలిక‌ శరీరంపై చాలా చోట్ల గాయాలు కావడంతోపాటు రక్తస్రావం కూడా అయింది. జిల్లా ఆసుపత్రికి చేరుకున్న జిఆర్‌పి ఎస్పీ అశుతోష్ శుక్లా మాట్లాడుతూ.. నిందితుడి ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ఇటాహ్‌లో నివసిస్తున్న ఆరుగురు కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్‌లోని తనక్‌పూర్‌కు వెళ్లారు. అక్కడ జాతరకు హాజరైన అనంతరం అందరూ గురువారం సాయంత్రం బరేలీ సిటీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. GRP ప్రకారం.. వీరంతా సిటీ స్టేషన్ నుండి కాస్గంజ్ వరకు మరొక రైలులో వెళ్లాలి. రాత్రి వారంతా పొరపాటున మరో రైలు ఎక్కారు. హడావుడిలో 16 ఏళ్ల బాలిక ఏసీ కోచ్‌ ఎక్కగా, ఆమె కుటుంబీకులు జనరల్‌ కోచ్‌ ఎక్కారు. కొన్ని నిమిషాల తర్వాత బాలిక‌ తప్పుడు బోగీలో ఎక్కినట్లు గ్రహించింది. ఇంతలో ఔటర్ స్టేషన్‌లో రైలు ఆగడంతో తిరిగి సిటీ స్టేషన్‌కు వెళ్లేందుకు బాలిక అక్కడ దూకింది. తన కుటుంబ స‌భ్యులు కూడా రాంగ్ ట్రైన్ దిగి సిటీ స్టేషన్‌కు చేరుకుంటారని భావించింది. ఈ క్ర‌మంలోనే బాలిక ఔటర్ నుంచి సిటీ స్టేషన్ వైపు కాలినడకన వెళ్తుండగా ఓ యువకుడు ఆమెను పొదల్లోకి లాగి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్ర‌తిఘ‌టించ‌డంతో దాడి కూడా చేశాడు.

నిందితుడు పరారీ అయిన తర్వాత బాలిక స్టేషన్ వైపు వెళ్లి.. ఆర్‌పిఎఫ్ జవాన్‌ను చూసి జరిగిన సంఘటనను వివరించింది. వెంటనే బాధితురాలిని జీఆర్పీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కుటుంబ‌స‌భ్యుల‌ కోసం వెతికిన తర్వాత ఆరోగ్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జీఆర్‌పీ ఎస్పీ అశుతోష్‌ శుక్లాతోపాటు పెద్ద సంఖ్యలో బలగాలు, అధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు.

బాలిక జరిగిన సంఘటనను పోలీసుల‌కు వివరించింది. బాధితురాలి శరీరంపై చాలా చోట్ల గాయాలున్నాయి. ప్రాథమిక విచారణలో.. రైలు ఔటర్‌లో వేగం తగ్గగానే ఆమె హడావిడిగా బోగీ నుండి దూకిందని, దాని కారణంగా ఆమె గాయపడి ఉండవచ్చని భావిస్తున్నారు. నిందితుడు కూడా బాధితురాలిని కొట్టాడు. బాలిక నిందితుడిని కొట్టిన‌ట్లు జీఆర్పీ ఎస్పీ తెలిపారు. నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో అనుమానిత ప్ర‌దేశాల‌లో సోదాలు చేస్తున్నారు.

Next Story