కోరికలను పెంచే క్యాప్సూల్‌ను తినిపించి బాలికపై అత్యాచారం..

Madhya Pradesh Crime News. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఓ వ్యక్

By Medi Samrat  Published on  6 Dec 2021 7:42 AM GMT
కోరికలను పెంచే క్యాప్సూల్‌ను తినిపించి బాలికపై అత్యాచారం..

మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను మొదట బాలికకు లైంగిక కోరికలను పెంచే క్యాప్సూల్‌ను తినిపించి, ఆపై ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో అధిక రక్తస్రావం కావడంతో బాలిక మృతి చెందింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితుడిపై పోలీసులు రివార్డు ప్రకటించారు. అనుప్పూర్ జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలోని రాజేంద్రగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో శుక్ర, శనివారాల్లో ఈ సంఘటన జరిగింది.

అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, షాహదోల్ జోన్, DC సాగర్ మాట్లాడుతూ, "ఇది చాలా బాధాకరమైన సంఘటన, నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అతని తలపై రూ. 30,000 రివార్డ్ ప్రకటించారు. పరారీలో ఉన్న యువకుడిని యశ్వంత్ మరావిగా గుర్తించారు" అని తెలిపారు. రాజేంద్రగ్రామ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి నరేంద్ర పాల్ మాట్లాడుతూ.. శనివారం నాడు 17 ఏళ్ల బాలిక మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందిందని, కేసు నమోదు చేశామన్నారు.

బాలికపై అత్యాచారం జరిగిందని, ఆమె జననాంగాల నుంచి అధిక రక్తస్రావం కావడం వల్లే చనిపోయిందని పోస్టుమార్టం నివేదికలో తేలిందని ఆయన తెలిపారు. 20-22 సంవత్సరాల వయస్సు గల నిందితుడు బాలికపై అత్యాచారం చేయడానికి ముందు ఆమెకు కొన్ని క్యాప్సూల్స్ ఇచ్చాడని తెలిపారు. బాధితురాలు శనివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తీవ్రమైన కడుపు నొప్పిని ఎదుర్కొందని కుటుంబ సభ్యులు తెలిపారు.


Next Story
Share it