కరీంగంజ్ జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినందుకు మొత్తం ఆరుగురు మైనర్లను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం ప్రకారం, ఈ సంఘటన దక్షిణ అస్సాంలోని రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి ప్రకారం.. సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
"ఈ సంఘటన ఐదు-ఆరు రోజుల క్రితం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు నవంబర్ 7న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా.. మేము పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసాము. నిందితులు ఆరుగురు యువకులను మంగళవారం అరెస్టు చేసాము "అని రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జి అధికారి నీలోవ్ జ్యోతి నాథ్ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. బాధితురాలితో పాటు నిందితులు కూడా 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారు అని ఆయన తెలిపారు. వారంతా రామకృష్ణ నగర్ ప్రాంతంలోని తేయాకు తోటల కార్మికుల కుటుంబాలకు చెందినవారని నీలోవ్ జ్యోతి నాథ్ తెలిపారు.
"అందరూ మైనర్లు.. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నందున మేము నిందితులను కోర్టు ముందు హాజరుపరిచాము. వారిని అబ్జర్వేషన్ రూమ్‌కు పంపాము. మా విచారణ జరుగుతోంది. నేరానికి రుజువుగా నిందితుల్లో ఒకరి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. నిందితులలో ఒకరు మొత్తం నేర సంఘటనను రికార్డ్ చేసి ఇతరులతో పంచుకున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.