మహారాష్ట్రలోని సోలాపూర్‌లో తన తల్లి ఇటీవల మరణించడంతో మనస్తాపం చెందిన 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శివశరణ్ భూతాలి టాల్కోటి అనే బాలుడు తన మామ ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడని అధికారులు తెలిపారు. బాలుడి తల్లి మూడు నెలల క్రితం కామెర్ల కారణంగా మరణించింది. అధికారులు ఈ ఘటనకు సంబంధించి ఒక సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. అందులో బాలుడు తన తల్లిని కలలో చూశానని, ఆమె తనను తన దగ్గరకు రమ్మని అడిగినట్లు పేర్కొన్నాడు.
'నేను శివశరణ్. నేను చనిపోతున్నాను ఎందుకంటే నాకు బతకాలని లేదు. నా తల్లి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిపోవాలి, కానీ నేను నా మామ, అమ్మమ్మ ముఖాలను చూస్తూ బతికే ఉన్నాను. నా మరణానికి కారణం నిన్న నా కలలో నా తల్లి వచ్చింది. నేను ఎందుకు అంతగా బాధపడ్తున్నానో అడిగి ఆమె దగ్గరకు రమ్మని చెప్పింది. కాబట్టి నేను చనిపోవాలని అనుకున్నాను." అని నోట్ లో ఉంది.
"మామయ్య, నేను చనిపోతున్నాను. నేను వెళ్ళిన తర్వాత, నా చెల్లిని సంతోషంగా ఉంచు. మామయ్య, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మమ్మను నాన్న దగ్గరకు పంపకండి. అందరూ, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు నా తల్లిదండ్రుల కంటే నాకు ఎక్కువ చేసారు" అని అందులో చెప్పాడు.
శివశరణ్ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడని అధికారులు తెలిపారు. అతను 10వ తరగతిలో 92 శాతం మార్కులు సాధించి డాక్టర్ కావాలని కోరుకున్నాడు. ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు.