యువకుడిని కత్తితో పొడిచి చంపి.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు

ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో ఒక దారుణమైన హత్యోదంతం వెలుగుచూసింది.

By -  Medi Samrat
Published on : 4 April 2026 6:00 PM IST

యువకుడిని కత్తితో పొడిచి చంపి.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు

ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో ఒక దారుణమైన హత్యోదంతం వెలుగుచూసింది. ఓ 20 ఏళ్ల యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన ప్రధాన నిందితుడు, ఆ తర్వాత ఆ నేరాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. కరణ్ అలియాస్ తరుణ్ (18) అనే ప్రధాన నిందితుడు మీ అన్న ఒక మర్డర్ చేశాడు. మీ అన్న కొద్ది రోజుల పాటు లోపలికి వెళ్తున్నాడు. మీ అందరి ప్రేమ ఇలాగే ఉండాలని తన అనుచరులను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు.

ఒక చిన్నపాటి వాగ్వాదం తర్వాత నితీష్ అలియాస్ నిక్కీ (20) అనే యువకుడిపై కరణ్, అతని ఇద్దరు స్నేహితులు దాడి చేశారు. కరణ్ బాధితుడిని కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన నితీష్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ హత్య జరిగిన కేవలం నాలుగు గంటల్లోనే ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు కరణ్, అతని అనుచరుడు మాంటీ (22) లను అరెస్ట్ చేయగా, మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తామే హత్య చేసినట్లు అంగీకరించారని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడానికి, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story