గదిలో ప్రేమికుల‌ మృతదేహాలు.. ఇద్దరికీ 16 ఏళ్లు కూడా నిండలేదు..!

ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లోని బాలిక ఇంట్లో 16 ఏళ్ల బాలుడు, బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు.

By Medi Samrat
Published on : 8 July 2025 7:26 PM IST

గదిలో ప్రేమికుల‌ మృతదేహాలు.. ఇద్దరికీ 16 ఏళ్లు కూడా నిండలేదు..!

ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లోని బాలిక ఇంట్లో 16 ఏళ్ల బాలుడు, బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. నజాఫ్‌గఢ్‌లోని నాగలి ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని అధికారి తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, ఇది వారి కుటుంబాలకు తెలిసి గొడవలు కూడా జరిగాయని తెలుస్తోంది.

"బాలిక ఇంట్లోని ఒక గదిలో మృతదేహాలు కనుగొనబడ్డాయి. ప్రాథమిక తనిఖీలో ఎటువంటి బాహ్య గాయాలు కనిపించలేదు. గది లోపలి నుండి లాక్ చేశారు. పోలీసులు ప్రస్తుతం కేసును ఆత్మహత్యగా పరిగణిస్తున్నారు" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. అయితే, బాలిక బంధువులే ఈ మరణాల వెనుక ఉన్నారని బాలుడి కుటుంబం ఆరోపించింది. కుట్రలో భాగంగానే అబ్బాయిని అమ్మాయి ఇంటికి పిలిపించి హత్య చేశారని ఆరోపించారు. సెటిల్మెంట్ సమయంలో అమ్మాయి మామ అబ్బాయిని చంపేస్తానని బెదిరించాడని కూడా కుటుంబం ఆరోపించింది.

Next Story