ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలుడు ఆదివారం నాడు అసభ్యకరమైన వీడియోను చూపించి మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బాలిక తండ్రి ఆదివారం పనికి వెళ్లగా, ఆమె తల్లి ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం పొరుగింటి 13 ఏళ్ల బాలుడు ఒంటరిగా ఉన్న బాలికను తన ఇంటికి రప్పించుకున్నాడు.

"బాలుడు మొబైల్ ఫోన్‌లో అసభ్యకరమైన వీడియో ప్లే చేసి, నా కుమార్తెపై అత్యాచారం చేశాడు. బాలిక పరిస్థితి విషమించడంతో.. బాలిక ఇంటి బయట పడేశాడు" అని తల్లి తన ఫిర్యాదులో చెప్పారు. బాలికను తల్లి గుర్తించి చూడగా ఆమె జననాంగాల నుంచి రక్తం కారడాన్ని గమనించింది. ఆ వెంటనే తల్లి బాలిక తాతయ్యలకు సమాచారం అందించడంతో వారు బాలుడిని పట్టుకుని కొట్టారు. ఇదిలా ఉండగా బాలికను చికిత్స నిమిత్తం క్లినిక్‌కి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. అదేరోజు రాత్రి బాలిక పరిస్థితి విషమించింది.

సోమవారం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆమెను సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆమె లాలా లజపతిరాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అన్ని చట్టపరమైన చర్యల అనంతరం అతడిని కరెక్షన్ హోమ్‌కు పంపిస్తామని బిద్నూ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అతుల్ కుమార్ సింగ్ తెలిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story