తోటి ఖైదీని కొట్టి లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న 19 ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు శనివారం అతనితో జైలులో ఉన్న 20 ఏళ్ల ఖైదీపై పాడు పనికి తెగబడ్డాడు. వీరిద్దరినీ వేర్వేరు నేరారోపణల కింద గత రెండు నెలలుగా ఒకే బ్యారక్‌లో ఉంచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. జైలు అధికారులకు తన బాధను వివరించడంతో పోలీసులకు సమన్లు పంపారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడైన యువకుడు ఏమి జరిగినా నోరు మూసుకుని ఉండాలని.. ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని కూడా చెప్పాడు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 ప్రకారం అసహజ నేరాల ఆరోపణలపై నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దోషిగా తేలితే నిందితులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.