తండ్రి లైంగిక వేధింపులు తాళలేక స్నేహితులకు ఫోన్ చేసిన కూతురు.. ఆ తర్వాత..
Teen arranges father’s murder to protest sexual harassment. తండ్రిని నరికి చంపిన కేసులో ఓ యువతి, ఆమె ముగ్గురు మైనర్ స్నేహితులను
By Medi Samrat Published on
24 Nov 2021 12:31 PM GMT

తండ్రిని నరికి చంపిన కేసులో ఓ యువతి, ఆమె ముగ్గురు మైనర్ స్నేహితులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యలహంక న్యూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన 45 ఏళ్ల దీపక్ నగరంలోని జీకేవీకే క్యాంపస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య మరియు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రైవేట్ కళాశాలలో చదువుతుండగా.. మరొకరు 4వ తరగతి చదువుతున్నారు. అయితే.. దీపక్ మొదటి కుమార్తెను లైంగికంగా వేధించడంతో.. భార్యాభర్తలు ఈ విషయమై గొడవ పడ్డారు.
సోమవారం కూడా మద్యం మత్తులో ఇంట్లో గొడవకు దిగగా.. విసుగెత్తిన కూతురు స్నేహితులకు ఫోన్ చేసింది. ఇంటికి వచ్చిన అమ్మాయి స్నేహితులు దీపక్‌ను హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు భార్యలు ఉన్నారని.. మొదటి భార్య బీహార్‌లో ఉంటుందని, రెండో భార్య స్వస్థలం కర్ణాటక కాగా.. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులు తెలిపారు. దీపక్ కుమార్తె.. తండ్రి తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తుండగా.. మరేదైనా కారణం ఈ హత్యకు దారితీసిందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story