తెలంగాణ‌లో దారుణాలు.. కదులుతున్న బస్సులో మహిళపై.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై చిన్ననాటి స్నేహితుడు..

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

By Medi Samrat  Published on  30 July 2024 5:30 PM IST
తెలంగాణ‌లో దారుణాలు.. కదులుతున్న బస్సులో మహిళపై.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై చిన్ననాటి స్నేహితుడు..

హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె చిన్ననాటి స్నేహితుడు కూడా ఈ క్రైమ్ లో భాగమై ఉండడం షాకింగ్ గా ఉంది. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతంరెడ్డి, మరో వ్యక్తి ఈ అత్యాచారం లో భాగమైనట్లు పోలీసులు తెలిపారు.

కేసు వివరాలు:

వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి మాట్లాడుతూ.. బాధితురాలిని ఆమె చిన్ననాటి స్నేహితుడు గౌతంరెడ్డి పార్టీకి ఆహ్వానించి ఈ దారుణానికి తెగబడ్డాడు. జులై 29న సాయంత్రం బాధితురాలు, గౌతంరెడ్డి ఓంకార్ నగర్‌లోని బొమ్మరిల్లు గ్రాండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. హోటల్‌ గదికి వెళ్లే ముందు బార్‌లో మద్యం సేవించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న బాధితురాలు.. కొద్ది సేపటికి స్పృహలోకి వచ్చింది. గదిలో గౌతమ్‌రెడ్డి మాత్రమే కాకుండా మరో వ్యక్తి కూడా ఉండడంతో కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న హోటల్ సిబ్బంది గదికి చేరుకోగా ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. బాధితురాలు అందించిన ఐడీ ప్రూఫ్ ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హోటల్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం గౌతంరెడ్డి, అతని సహచరుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం

నిర్మల్‌ నుంచి ప్రకాశం వెళ్తున్న ప్రైవేట్‌ బస్సులో డ్రైవర్‌ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు బయటకు రానివ్వకుండా చేయడానికి డ్రైవర్ ఆమె నోటిని ఓ గుడ్డతో బిగించాడని ఆమె తెలిపింది. బస్సు మేడ్చల్ సమీపంలో ఉండగా జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలోకి బస్సు రాగానే వాహనాన్ని అడ్డగించారు. ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

Next Story