ఏపీలో దారుణం.. బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం.. గర్భం దాల్చడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి..

Teacher raped and impregnated a minor tribal girl in Andhrapradesh. ఆంధ్రప్రదేశ్‌లో బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేశాడో ఉపాధ్యాయుడు.

By అంజి  Published on  13 Oct 2022 10:43 AM IST
ఏపీలో దారుణం.. బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం.. గర్భం దాల్చడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి..

ఈ రోజుల్లో అమ్మాయిలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేశాడో ఉపాధ్యాయుడు. ఈ ఘటన పల్నాడు జిల్లా రేణిగుంటలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఇది తెలిసిన ఉపాధ్యాయుడు.. బాలికకు అబార్షన్ చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నిందితుడు పెద్దలపూడి శ్రీనివాసరావుపై పోక్సో చట్టంతో పాటు, ఐపీసీ ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలిక మిస్సింగ్‌పై కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాలిక నివసిస్తున్న హాస్టల్‌కు వార్డెన్‌గా కూడా పనిచేశాడని ప్రముఖ దినపత్రిక తన కథనంలో పేర్కొంది. అతను విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బదిలీ ఆర్డర్‌తో నెల రోజుల క్రితం పాఠశాల నుండి వెళ్లిపోయాడు. అప్పుడే ఆ అమ్మాయి గర్భవతి అయ్యింది. దీంతో బాధితురాలు ఈ విషయం చెప్పేందుకు అతని వద్దకు వచ్చింది.

దసరా సెలవుల్లో శ్రీనివాసరావు అక్రమంగా గర్భస్రావం చేయించేందుకు బాలికను ఒంగోలులోని వైద్యశాలకు తీసుకెళ్లాడు.పండుగకు ఇంటికి రాకపోవడంతో బాలిక కుటుంబీకులు భయాందోళనకు గురయ్యారు. ఆమె హాస్టల్‌లో లేకపోవడంతో వారు మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక శ్రీనివాసరావుకు తోడుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు వచ్చిందని అర్థం చేసుకున్న నిందితుడు మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో మైనర్‌ బాలికను ఒంటరిగా వదిలి పారిపోయాడు. బాలికను పోలీసులు రక్షించి పిల్లల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Next Story