విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. దుస్తుల లోపల చేయి పెట్టి
'Teacher puts hands inside clothes,' student's pain reflected in front of parents.విద్యార్థినులతో ఉపాధ్యాయుడు అసభ్యంగా
By తోట వంశీ కుమార్
ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో వెలుగుచూసింది. ఉపాధ్యాయుడి చర్యల కారణంగా నలుగురు విద్యార్థినులు పాఠశాలకు వెళ్లడం మానేశారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది.
గ్వాలియర్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలోని ఉటిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని అరౌలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మున్సిలాల్ మహుల్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న 8-9 సంవత్సరాల వయస్సుగల నలుగురు విద్యార్థినులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టం పడడం లేదు. దీంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు విద్యార్థినులను పలు ప్రశ్నలు వేయగా తాము పాఠశాలకు వెళ్లకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.
ఉపాధ్యాయుడైన మున్సిలాల్ మహుల్.. బోధన సమయంలో వెనుక నిలబడి వారి దుస్తులలో చేతులు వేసుకున్నాడని, తాకరాని చోట చేతులు వేస్తున్నాడని చెప్పారు. నగ్నంగా ఫోటోలు తీస్తున్నాడని.. అందుకు నిరాకరిస్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పారు. విషయాన్ని విన్న తల్లిదండ్రులు షాక్ కు గురైయ్యారు. అనంతరం తేరుకుని పాఠశాలకు వచ్చి అక్కడ బీభత్సం సృష్టించారు. మున్సిలాల్ మహుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వీరే కాకుండా చాలా మంది బాలికలు అతడి నీచమైన చర్యల గురించి బయటకు చెప్పలేక భయపడిపోతున్నారన్నారు. ఈ ఘటనపై ఏఎస్పీ దేహత్ జైరాజ్ కుబేర్ మాట్లాడుతూ.. సదరు ఉపాధ్యాయుడిని జిల్లా కలెక్టర్ విక్రమ్ సింగ్ దోషి సస్పెండ్ చేశారని, మున్సిలాల్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.