ఉదయ్‌పూర్‌లోని సెయింట్ పాల్స్ పాఠశాల ఉపాధ్యాయుడు పదో తరగతి ఆన్‌లైన్ క్లాస్ యూఆర్‌ఎల్‌కు బదులుగా అశ్లీల చిత్రానికి సంబంధించిన లింక్‌ను పోస్ట్ చేశాడు. లింక్ పాఠశాల సర్వర్‌కు వెళ్లడంతో లింక్‌ను వెంటనే తొలగించడం సాధ్యం కాలేదు. సర్వర్ డౌన్ కావడంతో దాదాపు గంటపాటు లింక్ ఉండిపోయింది. ఇంతలో చాలా మంది విద్యార్థులు దాన్ని తెరిచి చూశారు. కొందరు విద్యార్థులు జరిగిన పొరపాటును ఉపాధ్యాయులకు తెలియజేయగా.. మరికొందరు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
పాఠశాల యాజమాన్యం ఈ కేసులో తప్పును అంగీకరించి సంబంధిత ఉపాధ్యాయుడు ధ్రువ్ కుమావత్‌కు నోటీసు జారీ చేసింది. టీచర్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా.. లేక పొరపాటున విద్యార్థులకు లింక్ వెళ్లిందా అనే దానిపై విచారణకు యాజమాన్యం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విషయం తెలియడంతో.. పాఠశాల యాజమాన్యం సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన సూచనలు చేసింది.
మరోవైపు మీడియాతో మాట్లాడిన టీచర్.. వాట్సాప్‌లో ఇతర మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నప్పుడు.. పిల్లలకు లింక్ పంపడానికి క్లాస్ టైం అయిందని చెప్పారు. అసభ్యకరమైన మెసేజ్ తొలగించబడటానికి బదులుగా కాపీ చేయబడి.. అనుకోకుండా పాఠశాల సర్వర్‌కు వెళ్లిందని అన్నారు. కేసు గురించి సమాచారం అందుకున్న ABVP కార్యకర్తలు.. సెయింట్ పాల్స్ స్కూల్ బయట నిరసన తెలిపారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆందోళన చేయడంతో పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.