ఉపాధ్యాయుడి సిగ్గుమాలిన చర్య.. 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల వీడియో లింక్.!

Teacher post vulgar video link in whatsapp group of 5th class students. రీవాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి సిగ్గుమాలిన చర్య తెరపైకి వచ్చింది. ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల

By అంజి  Published on  24 Nov 2021 3:56 AM GMT
ఉపాధ్యాయుడి సిగ్గుమాలిన చర్య.. 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల వీడియో లింక్.!

రీవాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి సిగ్గుమాలిన చర్య తెరపైకి వచ్చింది. ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల వీడియో లింక్‌ షేర్‌ చేసిన నిర్వాహకంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వీడియో అప్‌లోడ్ చేయగానే ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రీవా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలల 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్‌ గ్రూప్‌ ఉంది. ఇందులో 28 పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, 65 మహిళా టీచర్లు గ్రూప్‌లో మెంబర్లుగా ఉన్నారు.

రీవాలోని సాదా హరిజన బస్తీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఈ పనిని చేశాడు. ఉపాధ్యాయుడు కృపాకర్‌ చతుర్వేది పాఠశాలకు చెందిన 30 విద్యార్థులు కూడా వాట్సాప్‌ గ్రూప్‌లో ఉన్నారు. ఉపాధ్యాయుడు కృపాకర్‌ అశ్లీల వీడియో లింక్‌ను వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేసిన కాసేపటికి తీసేశాడు. పొరపాటు జరిగిందని, తాను తప్పు చేశానని, మళ్లీ ఎప్పుడూ ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని క్షమాపణలు చెప్పాడు. వాట్సాప్‌ గ్రూప్‌లో ఉన్న మరో మెంబర్‌ చెప్పే వరకు కూడా లింక్‌ షేర్‌ అయిన విషయం తనకు తెలియదని కృపాకర్ చెప్పాడు.

అయితే కృపాకర్‌ ఇలా చేయడం కొత్తేం కాదని ఓ టీచర్‌ ఆరోపించారు. గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి లింక్‌లు షేర్‌ చేశాడని అన్నారు. మార్తాండ్ నంబర్ 3లో పోస్ట్ చేసిన రీనా మిశ్రా అనే మహిళా పబ్లిక్ టీచర్ వీఆర్‌సీసీ రేవాకు లేఖ రాసి మొత్తం సమాచారాన్ని పంపారు. దీంతో పాటు టీచర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సస్పెన్షన్‌ చేయాలనే డిమాండ్‌ కూడా వినిపిస్తోంది. ఉపాధ్యాయుడు కృపాకర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కృపాకర్‌పై ఫిర్యాదు అందిందని అధికారులు తెలిపారు. వెంటనే తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Next Story