తరగతి గదిలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఉపాధ్యాయుడు అరెస్ట్

Teacher held for sexual assault class 6 student in Rajasthan. రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడి కామంతో కళ్లు మూసుకుపోయాయి.

By అంజి  Published on  7 Jan 2022 12:16 PM IST
తరగతి గదిలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఉపాధ్యాయుడు అరెస్ట్

రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడి కామంతో కళ్లు మూసుకుపోయాయి. అభం శుభం తెలియని 6వ తరగతి విద్యార్థిని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కరౌలీ జల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మైనర్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఆరోపణలపై పాఠశాల ఉపాధ్యాయుడిని గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాధితురాలు రోజు లాగే మంగళవారం పాఠశాలకు వెళ్లింది. స్కూల్‌ సమయం అయిపోయినా కూడా బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది.

బాలిక కోసం తల్లి పాఠశాలకు వెళ్లి వెతికింది. అదే సమయంలో పాఠశాల లోపలి నుంచి తాళం వేసి ఉన్న గదిలో నుంచి బాధితురాలి ఏడుపు తల్లికి వినిపించింది. ఆమె తలుపు బలవంతంగా తెరిచినప్పుడు, ఆమె తన కుమార్తెతో ఉన్న ఉపాధ్యాయుడిని చూసింది. నిందితుడు తల్లిని తోసేసి అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక తన తల్లికి జరిగిన బాధను వివరించడంతో వారు టీచర్‌పై ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు గురువారం పట్టుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గత మూడు నెలల్లో రాజస్థాన్‌లోని పాఠశాలల్లో బాలికలపై అత్యాచారం, వేధింపులు నాలుగు కేసులు నమోదయ్యాయి.

Next Story