భర్తపై అనుమానంతో.. మహిళపై చెప్పుతో భార్య దాడి.. వీడియో వైరల్.!

Suspicion on husband .. Wife attack on woman. భార్యపై భర్త, భర్తపై భార్య పెట్టుకునే అనుమానాలు ఎప్పటికి తీరనివి. ఈ అనుమానాలు ఒక్కొసారి దారుణ

By అంజి
Published on : 19 Oct 2021 1:32 PM IST

భర్తపై అనుమానంతో.. మహిళపై చెప్పుతో భార్య దాడి.. వీడియో వైరల్.!

భార్యపై భర్త, భర్తపై భార్య పెట్టుకునే అనుమానాలు ఎప్పటికి తీరనివి. ఈ అనుమానాలు ఒక్కొసారి దారుణ ఘటనలకు దారితీస్తుంటాయి. అనుమానాలు తీరక కొందరు దాష్టీకాలకు తెగబడుతుంటారు. మరికొందరు దాడులకు పాల్పడుతారు. తాజాగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం. భర్తపై అనుమానం పెంచుకున్న ఓ భార్య తన సోదరితో కలిసి.. జిమ్‌ సెంటర్‌లో తన భర్త పక్కన జిమ్‌ చేస్తున్న మహిళ చూసింది. ఆమె అనుమానంతో చెప్పుతో దాడికి దిగింది.

జిమ్‌లో ఉన్న వారు ఆపడానికి ప్రయత్నించినా కూడా భార్య ఆగలేదు. తన భర్త, మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఆ మహిళ ఎవరో తనకు తెలియదని భర్త ఎంత అరిచినా భార్య మాత్రం పట్టించుకోలేదు. భార్య భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భార్యభర్తలు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు.

Next Story