మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి విష‌యం..

Suddenly stomach of a mentally challenged woman started growing. మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఓ దారుణమైన అత్యాచారం ఘటన వెలుగులోకి

By Medi Samrat  Published on  13 Feb 2022 1:50 PM GMT
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి విష‌యం..

మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఓ దారుణమైన అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు అత్యాచారం ఆరోపణలపై 48 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం, ఈ వ్యక్తి చాలా నెలలుగా మానసిక వికలాంగురైన మహిళపై అత్యాచారం చేశాడు. ఆ మహిళ పొట్ట గత కొద్ది నెలలుగా పెరుగుతూ వచ్చింది. దీంతో ఆమెను స్థానికులు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించగా.. ఆ మహిళ గర్భం దాల్చిన అసలు నిజం బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన పాల్ఘర్ జిల్లాలోని విక్రమ్‌ఘర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

నిందితుడు పాల్ఘర్ జిల్లాలోని విక్రమ్‌ఘర్ ప్రాంతంలోని దప్చారి సుతార్ పాడా నివాసి అని మనోర్ పోలీసులు తెలిపారు. మానసిక వికలాంగురాలైన గ్రామానికి చెందిన ఆ మహిళపై గత ఐదు నెలలుగా నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళ గర్భం దాల్చడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. ఈ ఘటనలో అత్యాచారం చేసిన విషయం వెలుగులోకి రావడంతో, బాధితురాలి కుటుంబం సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదు చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


Next Story