బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకులు సజీవ దహనం

Suddenly bike caught fire 3 youths burn to death. హర్యానా రాష్ట్రంలోని హిసార్‌లో ఒకే మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ముగ్గురు

By Medi Samrat  Published on  29 Dec 2021 8:50 AM GMT
బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకులు సజీవ దహనం

హర్యానా రాష్ట్రంలోని హిసార్‌లో ఒకే మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ముగ్గురు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రమాదంలో మోటార్‌ సైకిల్ పూర్తిగా దగ్ధం కాగా, ముగ్గురి మృతదేహాలు కూడా కాలిపోయాయి. పోలీసులు ప్రస్తుతం కేసును రోడ్డు ప్రమాదంగా అభివర్ణిస్తున్నారు, అయితే ఈ సంఘటన హత్యేనని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. హోటల్ గ్రీన్‌వుడ్ ఢిల్లీ బైపాస్‌లో ఉంది. ఆర్య నగర్ నివాసి నిశాంత్ అనే వ్యక్తి ఈ హోటల్‌ను నడుపుతున్నాడు. భట్టుకాలన్ నివాసి అజయ్, సూర్యనగర్ నివాసి అభిషేక్ ఈ హోటల్‌లో పనిచేస్తున్నారు. సెక్టార్ 27లోని గుజరాతీ దాబాలో భోజనం చేసేందుకు సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ముగ్గురు ఒకే మోటార్‌సైకిల్‌పై వెళ్లినట్లు సమాచారం.

ఆహారం తిన్న తర్వాత తిరిగి వెళ్లడం ప్రారంభించి సత్రోడ్ వద్దకు రాగానే గుర్తుతెలియని ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో మోటార్ సైకిల్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ముగ్గురూ కాలిన గాయాలతో చనిపోయారా లేదా అనేది పోస్టుమార్టం తర్వాత తేలనుంది. సంఘటన తర్వాత కొందరు వ్యక్తులు ముగ్గురిని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే అప్పటికే ముగ్గురు మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఐజీ, హిసార్‌ పోలీసు సూపరింటెండెంట్‌ బల్వాన్‌సింగ్‌ రాణా కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యుల పోలీసుల ఫిర్యాదు మేరకు హత్య కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నామని, విచారణ కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.


Next Story
Share it