వావ్.. మద్యం స్మగ్లింగ్ కు ఎంత ప్లానింగో..

Such a method of smuggling liquor that even police were stunned. బీహార్‌లో సంపూర్ణ మ‌ధ్య‌పాన‌ నిషేధం అమలులో ఉంది. మద్యం సేవించడం,

By Medi Samrat  Published on  22 April 2022 2:15 PM GMT
వావ్.. మద్యం స్మగ్లింగ్ కు ఎంత ప్లానింగో..

బీహార్‌లో సంపూర్ణ మ‌ధ్య‌పాన‌ నిషేధం అమలులో ఉంది. మద్యం సేవించడం, అమ్మడం రెండూ చట్టరీత్యా నేరమే అయినా రాష్ట్రంలో మద్యం స్మగ్లర్లు దానిని ప్రజలకు చేర్చేందుకు ఎన్నో ప్లాన్ లు వేస్తూ ఉన్నారు. వారి ప్రణాళికలను చూసి పోలీసులు సైతం షాక్ అవుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి ఘటన సుపాల్‌లో వెలుగుచూసింది. సుపాల్‌లోని జాడియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో బోల్తా పడిన తర్వాత, దాని డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి ఆటో చుట్టూ మద్యం వాసన వస్తోంది. అనంతరం పోలీసులు ఆటోను తనిఖీ చేయడం ప్రారంభించారు. మొదటిసారి వెతికినా పోలీసులకు ఏమీ దొరకలేదు, కానీ మళ్లీ సోదాల్లో పోలీసులు ఆటోలోని ఒక్కో భాగాన్ని వేరు చేయడం ప్రారంభించారు.

పోలీసులు ఆటో పైకప్పును తొలగించగా.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆటో పైకప్పు మొత్తాన్ని మద్యం తరలించేసెల్లార్‌గా మార్చి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఆటో పైకప్పు నుంచి భారీగా కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో వందలాది విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ ప్రాంతం లోని ఆటోలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ప్రత్యేకంగా ప్రతి ఆటో పైకప్పును పరిశీలిస్తున్నారు. సుపాల్‌లో ఆటోల ద్వారా భారీగా మద్యం అక్రమంగా తరలిస్తున్నారని, ఇందులో కొంత మంది ముఖ్యమైన వ్యక్తుల హస్తం ఉందని పోలీసులకు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి త్రివేణిగంజ్ డీఎస్పీ గణపతి ఠాకూర్ మాట్లాడుతూ.. మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నామని, ఆటోల నుంచి మద్యం అక్రమ రవాణా చేస్తున్న నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదిస్తామని తెలిపారు.

Next Story