ఆ అబ్బాయి.. ఇంకో అబ్బాయిని ప్రేమించాడు.. చివరికి..!
Student committed suicide due to homosexual affair. కోట నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టల్‌లో
By Medi Samrat
కోట నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టల్‌లో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నివాసి. మృతుడి నుంచి సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. ఓ అబ్బాయిపై తనకున్న ప్రేమ గురించి కూడా అందులో చెప్పాడు. సమాజానికి భయపడి.. తల్లిదండ్రులు ఏమనుకుంటారో అనే బాధతోనూ, భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
విద్యార్థి సూసైడ్ నోట్‌లో 'సారీ అమ్మ-నాన్న, కానీ నేను దేనికీ అర్హుడిని కాదు.. నీ కొడుకు చాలా పోరాడాడు కానీ ఓడిపోయాడు. నా కోసం ఇంత డబ్బు వృధా అయినందుకు క్షమించండి. నా ప్రేమలో తప్పు లేదు, అది అబ్బాయితో జరిగింది. కానీ అది నిజమైంది. నాకు అతడంటే చాలా ఇష్టం.' అని చెప్పుకొచ్చాడని అధికారులు తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి పేరు ప్రథమ్ జైన్. అతని తండ్రి ప్రైవేట్ డాక్టర్. కోటాలో అతను 2 నెలలుగా కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు. శుక్రవారం కోచింగ్ క్లాసెస్ కు రాలేదని అతని స్నేహితులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్నేహితులు అతని గది తలుపు తట్టగా, అతను తలుపు తీయలేదు. అతను నిద్రపోతున్నాడని అతని స్నేహితులు అనుకున్నారు. సాయంత్రం మళ్లీ తలుపు తట్టినా మళ్లీ తలుపు తీయలేదు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా ప్రథమ్ అప్పటికే ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని ఎంబీఎస్ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. సమాచారం అందుకున్న ఆయన కుటుంబ సభ్యులు కోట చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.