స్కూల్ బస్సు మిస్.. బాధతో షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు

Student commits suicide when school bus missed. క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. స్కూల్ బస్సు మిస్

By Medi Samrat  Published on  23 Nov 2021 1:13 PM GMT
స్కూల్ బస్సు మిస్.. బాధతో షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు

క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. స్కూల్ బస్సు మిస్ అయిందన్న కారణంతో ఏకంగా ప్రాణాలే తీసేసుకున్నాడు ఓ పిల్లాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బేతుల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి స్కూల్ బస్సును మిస్ చేసుకున్నాడు. స్కూల్ కు ఈ రోజు హాజరు కాలేకపోతున్నాననే బాధతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బేతుల్‌లోని చోప్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమ్ దోష్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్దో గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలోని చోప్నాలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పేరు రాహుల్ సర్దార్. గ్రామంలోని ఇతర పిల్లలతో కలిసి బస్సులో పాఠశాలకు వెళ్లేవాడు.

సోమవారం ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలు దేరి స్టాప్‌కు చేరుకోగానే బస్సు వచ్చిందని, అయితే బస్సు నిండుగా ఉండడంతో పాఠశాల పిల్లలను కూర్చోబెట్టేందుకు కండక్టర్ నిరాకరించాడు. దీని తర్వాత రాహుల్, ఇతర పిల్లలు ఇంటికి తిరిగి వచ్చారు. రాహుల్ మాత్రం పాఠశాలకు చేరుకోలేకపోయాననే బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ నుంచి రాగానే ఇంటి వెనుక వైపు వెళ్లిన రాహుల్ కొద్దిసేపటి తర్వాత కనిపించక పోవడంతో తల్లి వెతకగా అక్కడ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు.

రాహుల్ తండ్రి ముంబైలో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారని, ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారని సమాచారం. రాహుల్‌ మామ కనిక్‌ మాట్లాడుతూ.. తన అల్లుడు స్కూల్‌కి వెళుతున్నానని బాధ పడ్డాడని.. అయితే బస్సు తప్పిపోవడంతో స్కూల్‌కి వెళ్లలేకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటి వెనుక చెట్టుకు ఉరివేసుకున్నాడని తెలిపాడు. రాహుల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Next Story