2019లో విడుదలైన చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో చిన్న పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ సోమవారం చెన్నై విమానాశ్రయంలో రూ. 40 కోట్ల విలువైన మెథాక్వాలోన్ అనే మాదకద్రవ్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. అస్సాంకు చెందిన 32 ఏళ్ల బ్రహ్మ, AI 347 విమానంలో సింగపూర్ నుండి చెన్నైకి వచ్చాడు. ఆ సమయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అతన్ని అడ్డుకుంది. అతని వెనుక నైజీరియన్ ముఠా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
డబ్బు అవసరం కావడంతో, విశాల్‌ను సెలవుల కోసం కంబోడియాకు వెళ్లమని నమ్మించినట్లు సమాచారం. అతను తిరిగి వచ్చే సమయంలో, డ్రగ్స్ ఉన్న ట్రాలీ బ్యాగ్‌ను తీసుకెళ్లమని అతనికి సూచించారని అధికారుల విచారణలో తేలింది. ఈ క్రైమ్ వెనుక ఉన్న నైజీరియన్ ముఠాను పట్టుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.