పెళ్లికి వెళుతూ రోడ్డుపై డ్యాన్స్.. ఇంతలో ఘోరం..

Speeding truck runs over Baraati killing three persons. పెళ్లి వివాహ ఊరేగింపులో వరుడిని తీసుకువెళుతున్న బృందం హైవేకు దగ్గరగా

By Medi Samrat  Published on  26 Nov 2021 1:18 PM GMT
పెళ్లికి వెళుతూ రోడ్డుపై డ్యాన్స్.. ఇంతలో ఘోరం..

పెళ్లి వివాహ ఊరేగింపులో వరుడిని తీసుకువెళుతున్న బృందం హైవేకు దగ్గరగా నృత్యం చేస్తూ కనిపించింది. ఆ సమయంలో చీకటిగా ఉండగా.. కేవలం హెడ్‌లైట్‌లు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ సమయంలో ఉన్నట్లుండి.. ఓ ట్రక్కు ఆ బృందం మీదకు వచ్చేసింది.. దీంతో పెళ్లి ఇంటిలో కాస్తా విషాదం నెలకొంది. ఒక పెద్ద ట్రక్కు పెళ్లి బృందం మీదకు వెళ్లడంతో కొంతమంది అతిథులను దాని చక్రాల కింద నలిగిపోయారు.

కెమెరాలో చిక్కుకున్న ఈ ఘోర ప్రమాదం బుధవారం ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. వరుడి తండ్రితో సహా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కాగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పెళ్లి ఊరేగింపు జాతీయ రహదారి 226పై ఉండగా ఈ ప్రమాదం జరిగింది. నివేదికల ప్రకారం, ట్రక్ డ్రైవర్ తాగి ఉన్నాడని ఆరోపించారు. పోలీసులకు అప్పగించేలోపే స్థానికులు అతడిని కొట్టారు.


Next Story
Share it