బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారం.. రెండు నెలల పాటు రాక్షస క్రీడ.!
Sons and father gang raped the girl. హర్యానా రాష్ట్రంలో సభసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. పానిపట్ జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుతున్న
By అంజి Published on 5 Nov 2021 9:14 AM GMTహర్యానా రాష్ట్రంలో సభసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. పానిపట్ జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిపై తండ్రీకొడుకులు కలిసి అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే... పానిపట్‌లో బాలిక తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తోంది. పొరుగింటిలో ఉండే అజయ్ అనే యువకుడు బాలికను ప్రేమ పేరుతో నమ్మిస్తూ వచ్చాడు. టినేజ్‌లో ఉన్న బాలిక ఆ యువకుడి మాటలు నమ్మి ప్రేమలో పడింది. ఇదే అదనుగా భావించిన అజయ్.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఇంట్లో అజయ్ తండ్రి సదర్, సోదరుడు అర్జున్‌లు ఉన్నారు. ఈ క్రమంలోనే మత్తు మందుతో కూడిన సిగరెట్ కాల్చమని ఆమెను బలవంతం చేశారు. ఆ తర్వాత అజయ్‌ను మ్యారేజ్ చేసుకుంటానని బాలిక చెప్పింది. దీంతో ఆమెపై తండ్రి కొడుకులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
రెండు నెలల పాటు బాలిక.. ఇంట్లోనే బంధించారు. ప్రతి రోజు బాలికకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని స్విచ్‌వేషన్‌లోకి బాలిక వెళ్లిపోయింది. చివరకు వారి చెర నుండి తప్పించుకున్న బాలిక.. ఇంటికి చేరింది. జరిగిన ఘటన గురించి బాలిక తన తల్లికి వివరించింది. ఇదే విషయమై బాలిక తల్లి మాట్లాడుతూ.. తన కుమార్తెను ఇంటి నుంచి తీసుకెళ్లారని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపణలు చేసింది. తన కూతురికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించలేదని తెలిపింది. దీంతో తల్లీకూతుళ్లు కలిసి సీఎం ఇంటికి వెళ్లారు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులు అజయ్, అర్జున్, సదర్, అజయ్ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.