మంగళవారం (మే 24) రాత్రి పూరీ జగన్నాథ దేవాలయం ముందున్న చారిత్రక ఎమ్మార్ మఠం సమీపంలో ఒకరు కాల్చి చంపబడ్డారు. మృతుడు హరచండి తలుచా సాహికి చెందిన ఆలయ పూజారి కుమారుడు శివరామ్ పాత్రగా గుర్తించారు. పూరీ జగన్నాథ దేవాలయం సింఘ ద్వార (ప్రధాన ద్వారం) నుండి కేవలం 20 మీటర్ల దూరంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి శివరామ్‌ను అక్కడికక్కడే చంపారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అంబులెన్స్‌ను పిలిచి గాయపడిన వ్యక్తిని పూరీ జిల్లా హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు.
పూరీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కన్వర్ విశాల్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. "ప్రధాన నిందితుడిని చందన్ బారిక్‌గా గుర్తించాం. ఘటనకు సంబంధించి అతడిని అదుపులోకి తీసుకున్నాం. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం" అని కన్వర్ విశాల్ సింగ్ చెప్పారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యక్తిగత శత్రుత్వమే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం కారణంగా మృతుడి హత్య జరిగిందని స్థానికులు అంటున్నారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.