తల్లిదండ్రులను దారుణంగా హతమార్చిన కుమారుడు

Son hacks parents to death in Kerala’s Thrissur. కేరళలోని త్రిసూర్‌లో ఆదివారం ఉదయం 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిదండ్రులను నరికి చంపిన

By Medi Samrat  Published on  10 April 2022 10:17 AM GMT
తల్లిదండ్రులను దారుణంగా హతమార్చిన కుమారుడు

కేరళలోని త్రిసూర్‌లో ఆదివారం ఉదయం 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిదండ్రులను నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది.ఈ సంఘటన ఉదయం 9 గంటలకు చోటు చేసుకుందని పోలీసు వర్గాలు మీడియాకి తెలిపాయి. కుట్టన్ (60), చంద్రిక (55) తమ ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తుండగా, వారి కుమారుడు అనీష్ కొడవలితో నరికి చంపాడు. ముందుగా కుట్టన్‌పై దాడి చేశాడు.. ఆ తర్వాత చంద్రికపై కూడా పలుమార్లు దాడి చేశారని పోలీసులు తెలిపారు.

అనీష్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి.. ఘటన గురించి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అనీష్ అక్కడి నుండి ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనీష్ కు తల్లిదండ్రులతో గొడవలు జరుగుతుంటాయని చుట్టుపక్కల వారు మీడియాకు తెలిపారు. మరణించిన దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఆమెకు వివాహం అవ్వడంతో ఆమె అత్తారింట్లో నివసిస్తోంది. అనీష్ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. అనీష్ ఈ దారుణానికి పాల్పడడానికి గల కారణాన్ని అన్వేషిస్తూ ఉన్నారు.


Next Story
Share it