అమానుషం.. కన్నతల్లిపై కొడుకు అత్యాచారం, అరెస్ట్

Son arrested for raping his mother in Karnataka. మానవ మృగంలా మారిన ఓ కొడుకు కన్న తల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు

By అంజి  Published on  16 Jan 2022 3:44 AM GMT
అమానుషం.. కన్నతల్లిపై కొడుకు అత్యాచారం, అరెస్ట్

మానవ మృగంలా మారిన ఓ కొడుకు కన్న తల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు తాలూకాలోని కేదంబాడి గ్రామంలో తన తల్లిపై కొడుకు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. తల్లిని ఆసుపత్రిలో చేర్పించి, కొడుకును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడిన తర్వాత, బాధిత తల్లి అస్వస్థతకు గురై పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 58 ఏళ్ల తల్లి అత్యాచారంపై పుత్తూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 362 (2) (ఎన్), 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

తల్లి, నిందితుడు ఒకే ఇంట్లో ఉండేవారని పోలీసులు తెలిపారు. జనవరి 12న ఈ ఘటన జరగ్గా.. తన గదిలో నిద్రించడానికి వెళ్లిన నిందితుడు తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి తల్లి గదిలోకి వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తల్లి ప్రతిఘటించి కేకలు వేయడంతో నిందితుడు ఆమె నోటిని గుడ్డతో బిగించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. మరుసటి రోజు ఉదయం నిందితుడు మరోసారి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం తల్లి పుత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా చికిత్స పొందుతోంది. నిందితుడి భార్య ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story