కేజీ పాము విషం దొరికింది.. ధర ఎంతటే..!

Snake poison worth Rs 1.50 cr captured in Odisha. ఒడిశాలో పోలీసులు ఒక కిలో బరువు ఉన్న పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు

By Medi Samrat  Published on  20 Nov 2021 6:21 PM IST
కేజీ పాము విషం దొరికింది.. ధర ఎంతటే..!

భువనేశ్వర్ : ఒడిశాలో పోలీసులు ఒక కిలో బరువు ఉన్న పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషం ధర బ్లాక్ మార్కెట్ లో సుమారు రూ. 1.50 కోట్ల మార్కెట్ విలువ కలిగి ఉందని చెబుతూ ఉన్నారు. తరంగ్ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు 1 కిలోల విషాన్ని విక్రయించాలని ప్లాన్ చేస్తున్నట్లు డియోగర్ జిల్లా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంబల్‌పూర్‌లోని సిందూర్‌పాంక్‌కు వెళ్లి తామే కొనుక్కుంటామని చెబుతూ క్లయింట్‌లుగా వ్యవహరిస్తూ అనుమానిత నేరస్థులను కలిశారు.

వారిదగ్గర నిజంగానే పాము విషం ఉందని గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఒక కిలో బరువు ఉన్న పాము విషం ఓ గాజు డబ్బాలో దాచారని తెలుస్తోంది. అక్కడకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు కనుగొన్నారు. కైలాష్ చంద్ర సాహు, రంజన్ కుమార్ పాధి అనే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంత విషం ఎక్కడ నుండి సేకరించారో అనే విషయాన్ని పోలీసులు ఆరాతీస్తున్నారు.


Next Story