ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి ఆగస్టు 27న అదృశ్యమైన 20 ఏళ్ల యువతి అస్థిపంజరం 22 రోజుల తర్వాత నగరానికి సమీపంలోని చెరకు తోటలో లభ్యమైంది. చనిపోయిన యువతి అయోధ్యలోని విశాల్ మెగా మార్ట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తూ ఉండేది. ఆగస్టు 27న ఆమె ఇంటికి రాకపోవడంతో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితురాలు ఈ-రిక్షా ఎక్కుతున్న వీడియోను వారు కనుగొన్నారు. ఆ తర్వాత వారు డ్రైవర్‌ను పట్టుకున్నారు.
విచారణ తర్వాత అనూప్ సింగ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి గది అద్దెకు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మోసగించినట్లు విచారణలో వెల్లడించాడు. బాధితురాలికి ఇంటిని చూపించే క్రమంలో ఆమెకు డ్రింక్ ఇచ్చారు. అనంతరం బాలికను స్వగ్రామానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. యువతి అందుకు ఒప్పుకోకపోవడంతో, అతను ఆమెను చంపి, మృతదేహాన్ని తన గ్రామ సమీపంలోని చెరకు తోటలో విసిరేశాడు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయే ముందు ఆమె పర్సు, మొబైల్ ఫోన్‌ను దొంగిలించాడు. అనూప్ ఇచ్చిన సమాచారంతో 22 రోజుల తర్వాత మృతదేహాన్ని కనుగొన్నామని సీఓ సిటీ శైలేంద్ర సింగ్ వెల్లడించారు. చెరకు పొలాల్లో యువతి అస్థిపంజరాన్ని గుర్తించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. విచారణలో బాధితురాలి ఐడీ కార్డు, బట్టలు, బూట్లు, జుట్టు, అనూప్ ఆధార్ కార్డును కూడా పోలీసులు గుర్తించారు.