రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Six Year Old child died in a road accident. హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 July 2023 9:22 PM IST
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదంగల్ గ్రామంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో భావన (6) అనే బాలిక ఆడుకుంటున్న సమయంలో సిస్టర్ నివేదిత స్కూల్ బస్సు అత్యంత వేగంగా వచ్చి బాలికను ఢీ కొట్టింది. బాలాపూర్ మండలంలోని కర్మల్ గూడా కు చెందిన మిరియాల భావన (6) మల్లాపూర్ లోని ఆకాంక్ష స్కూల్లో యూకేజీ చదువుతున్నది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి బాలికను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో బాలిక తలకు తీవ్రమైన గాయం కావడంతో బాలిక అక్కడే పడిపోయి ఉంది. రక్తం మడుగులో పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కానీ బాలిక అప్పటికే మృతి చెందినట్లు గా వైద్యులు వెల్లడించారు. బాలిక మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసు కుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు స్కూల్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా స్కూళ్లు పునః ప్రారంభం కాగానే అధికారులు స్కూల్ బస్సులపై కొరడా ఝళిపించారు. స్కూల్ బస్సు నడపడంలో నియమ నిబంధనలు పాటించని పాఠశాలపై దాడులు చేసి పలు స్కూలుకు సంబంధించిన స్కూల్ బస్సులను సీజ్ చేశారు.. ఎక్కువ శాతం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు స్కూల్ పసులపై దాడులు చేశారు. ఈ ఘటనలో కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడం వల్ల ఓ చిన్నారి మృత్యువాత పడింది. పాపం మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Next Story